
A friend`s wish to see you


ఇది ఒక స్నేహాల దండ
చెల్లా చెదురైన పూవులు
జీవితపు వడిలో విడివిడిగా పోయిన ఆకులు
ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా
వెతుక్కుంటూ
అత్మీయతలను లెక్క వేసుకుంటూ
అనుభవాలను నెమరు వేసుకుంటూ
పసితనపు చేష్టలు
తప్పయితే క్షమించమని
ఒప్పయితే గర్వించుకొని
చిలిపి అయితే .. నవ్వేసుకొని
అంతంలేని మరో ఆత్మీయ బంధానికి
ఆర్రులు చాచి
అడుగులో అడుగేసుకుంటూ
ప్రతీ క్షణాన్ని ఒడిసిపట్టుకుంటూ
చిన్ననాటి స్నేహం చిరకాలముండు
అనే నానుడిని
నిశ్చల హృదయంతో నిజం చేస్తున్నవేళ
నువ్వెందుకు నిన్నలా వెలెసుకుంటున్నావు
నిన్ను కోరుకుంటున్న వాళ్లని ఎందుకలా దూరం చేసుకుంటున్నావు
పెద్దాపురం, పెదవేగి, మద్దిరాల, యానం లను కలపగలిగిన ఆ శక్తిని
బహిష్కరించ గలిగే బలమైన శక్తిని నువ్వెక్కడ పొందావు మిత్రమా
రా.. రా.. అని పిలిచే ప్రేమ హృదయాలను నెట్టేయగలిగిన
నిర్ధయ హృదయం నిన్నేప్పుడు ఆక్రమించింది నేస్తమా
మా అనుభవంలో నువ్వు మంచోడివే అయినపుడు
నీ అనుభవంలో మేమెందుకు జంటరానోళ్ళమయినాము స్నేహితా
నువ్వు ఎంత దూరం వెళ్లినా,
ఎంత కాదనుకున్నా
ఎంత వదిలించుకుందామనుకున్నా
నీకోసం ఎనభై జంటల కళ్లు
ఆశగా, ప్రేమతో.. ఎదురుచూస్తూనే ఉంటాయి
-JNVP IIIrd Batch, Peddapuram.
Comment